- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రతి పోలీస్‌కు నేను మద్దతుగా ఉంటా! సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
దుబాయ్‌లో ఇటీవల నిర్వహించిన వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: (Dubai)దుబాయ్‌లో ఇటీవల నిర్వహించిన (World Police Summit) వరల్డ్ పోలీస్ సమ్మిట్-2025లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిషనర్ సీవీ ఆనంద్.. సమ్మిట్‌లో ఎక్సలెన్స్ ఇన్ యాంటీనార్కోటిక్స్ విభాగంలో ప్రథమ స్థానాన్ని దక్కించుకుని అవార్డు స్వీకరించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు. శనివారం ఎక్స్ వేదిగా ఆసక్తికర ట్వీట్ చేశారు.
‘వివిధ రంగాల్లో ప్రపంచానికి (Telangana Police) తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈ రోజు తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన (Hyderabad Narcotic Enforcement) హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ ఫోర్స్ మెంట్ చీఫ్ సీవీ ఆనంద్ (CV Anand)కు ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు. (Drug Free Telangana) డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం నేను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు నేను మద్దతుగా ఉంటాను’ అంటూ ట్వీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.






