- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్యాగనిరతికి ప్రతీక బక్రీద్.. ముస్లింలకు సీఎం రేవంత్ బక్రీద్ శుభాకాంక్షలు
by Ajay Maddhiboyina |
త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీక బక్రీద్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని సీఎం గుర్తు చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: త్యాగనిరతి, దైవభక్తికి ప్రతీక బక్రీద్ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం చేయడానికి సిద్ధపడిన గొప్ప సంఘటనను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని సీఎం గుర్తు చేశారు. బక్రీద్ పండుగ మనిషికి త్యాగం, దాతృత్వం, విశ్వాసం, మానవత్వం వంటి గొప్ప విలువలను గుర్తుచేస్తుందని పేర్కొన్నారు. జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా దేవుడిపై నమ్మకంతో సన్మార్గంలో ముందుకు సాగాలనే సందేశాన్ని ఈ పండుగ అందిస్తున్నదని తెలిపారు. తమకు ఉన్నదాంట్లో కొంతైనా అవసరమైన వారికి పంచిపెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ ప్రపంచానికి చాటిచెబుతున్నదని పేర్కొన్నారు.
Next Story






