- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Koneru Humpy: కోనేరు హంపి విజయం సాధించాలి.. ఎక్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి విషెస్.. ఎందుకంటే?
ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి అభినందనలు తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: జార్జియాలో జరుగుతున్న (FIDE Women’s World Cup) ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళా గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి (Koneru Humpy) సెమీ ఫైనల్‌కు చేరుకుంది. వరల్డ్ కప్‌లో సెమీస్‌లో అడుగుపెట్టిన తొలి ఇండియన్‌గా ఘనత సాధించింది. ఈ మేరకు గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిపై భారత్‌లోని ప్రముఖులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోనేరు హంపికి అభినందనలు తెలిపారు. ‘ఎఫ్ఐడీఈ ఉమెన్స్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు చేరిన గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపికి నా ప్రత్యేక అభినందనలు. ఈ లీగ్‌లో చేరిన తొలి భారతీయ మహిళ కోనేరు హంపి కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆమె విజయం సాధించాలని మనసారా కోరుకుంటున్నాను’ అని విషెస్ తెలిపారు. కాగా, ఫిడే మహిళల వరల్డ్ కప్‌లో ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో కోనేరు హంపీ 1.5-0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్‌పై విజయం సాధించింది. ఇక, దివ్య దేశ్‌ముఖ్, ద్రోణవల్లి హారిక మధ్య జరుగుతున్న క్వార్టర్స్ ట్రై బ్రేకర్‌కు వెళ్లింది. తొలి గేమును డ్రా చేసుకున్న వీరు రెండో గేములోనూ పాయింట్స్ పంచుకున్నారు. నేడు వీరి టై బ్రేకర్ జరగనుంది.






