- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: ఇంటర్ విద్యార్థులకు CM రేవంత్ శుభాకాంక్షలు.. మరో సూచన కూడా..
తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు(Intermediate Results) విడుదలైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు(Intermediate Results) విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా(X) వేదికగా పోస్టు పెట్టారు. ‘ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినీవిద్యార్థులకు నా అభినందనలు. భవిష్యత్‌లో మీరు ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్పగా రాణించాలని ఆకాంక్షిస్తున్నాను’ అని పేర్కొన్నారు.
ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా తన విషెస్ తెలిపారు. కాగా, తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు (Telangana Inter Results) విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు(Inter Board) కార్యాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ఇంటర్ ఫలితాల్లో గతేడాది కంటే పాస్ పర్సంటేజ్(Pass Percentage) పెరిగిందని చెప్పారు. అంతేకాదు.. ఈ ఏడాది ఫలితాల్లో అమ్మాయిలదే పైచేయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఉత్తీర్ణులైనవిద్యార్థినీవిద్యార్థులకు…నా అభినందనలు.భవిష్యత్ లో మీరు…ఉన్నత చదువులు చదివి…జీవితంలో గొప్పగా రాణించాలనిఆకాంక్షిస్తున్నాను.#InterResult2025— Revanth Reddy (@revanth_anumula) April 22, 2025






