- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: విపక్ష నేతల అనుభవాన్ని ఉపయోగించుకుంటాం.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు అవసరం అయితే విపక్ష నేతల అనుభవాన్ని కూడా ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు అవసరం అయితే విపక్ష నేతల అనుభవాన్ని కూడా ఉపయోగించుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఇవాళ హైదరాబాద్ Hyderabad)లోని హోటల్ తాజ్ కృష్ణ (Taj Krishna)లో మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు (CH Vidya Sagar Rao) ఆత్మకథ ‘ఉనిక’ (Unika) పుస్తకావిష్కరణ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి విద్యా సాగర్ రావు సేవలు అవసరమని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తే.. అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని తెలిపారు. తెలంగాణ (Telangana)ను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని అన్నారు. మెట్రో (Metro), రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi)ని వేదిక మీది నుంచి విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు దేశంలో సిటీల్లో అగ్రగామిగా ఉన్న హైదరాబాద్ (Hyderabad) నేడు 9వ స్థానానికి పడిపోయిందని కామెంట్ చేశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి అన్ని పార్టీల నేతలు కలిసి పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.






