CM Revanth Reddy: రేపు ఏఈ, జేటీఓలకు నియామకపత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-05-13 06:25:06  IST  )

ఏఈ, జేటీఓలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

CM Revanth Reddy: రేపు ఏఈ, జేటీఓలకు నియామకపత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న నీటిపారుదల శాఖలో 224 అసిస్టెంట్ ఇంజనీర్లు (ఏఈ)లు, 199 మంది జూనియర్ టెక్నికల్ అధికారులు (జేటీవో)ల నియామక పత్రాల అందజేతకు మూహుర్తం ఖరారైంది. రేపు సాయంత్రం జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించనున్నారు. అనంతరం నీటి పారుదల శాఖ అంశాలపై సమీక్ష జరపనున్నారు. వాస్తవానికి ఈ నియామక పత్రాల పంపిణీ గత ఏప్రిల్ లోనే చేయాల్సి ఉంది. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ అంశంపై ఇటీవలే మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. దేవుడు వరమిచ్చినా.. పూజారి వరమివ్వని చందంగా ఉంది ఇరిగేషన్ శాఖలో ఏఈ, జెటివోలుగా ఎంపికైన అభ్యర్థుల పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించిన సంబురాన్ని లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గం చేస్తోందని దుయ్యబట్టారు.

Next Story