- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డి MLC ఎలక్షన్స్ ప్రచారం
రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో రెండు టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు ఈనెల 27న జరగనున్నాయి. ఈనెల 25తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరుఫున కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్‌సహా ప్రముఖులు ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్సహా ఆయా జిల్లాల మంత్రులు, ఇంఛార్జి మంత్రులు ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ ఎన్నిక ఉన్న నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం విస్త్రతంగా సాగుతుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న మూడు స్థానాల్లో బీఆర్ఎస్ఒక్క స్థానంలో కూడా పోటీ చేయడంలేదు. కాంగ్రెస్‌పార్టీ ఒక గ్రాడ్యుయేట్నియోజకవర్గంలోనే పోటీ చేస్తుంది. బీజేపీ మాత్రం మూడు స్థానాల్లోనూ పోటీ చేస్తుంది. దీంతో బీజేపీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గత వారం రోజులుగా రాష్ట్రంలోనే మకాం వేసి అన్ని జిల్లాలో సభలకు హాజరవుతున్నారు. మీడియా సమావేశాలను నిర్వహిస్తున్నారు.
ఓటర్లను, పార్టీ కేడర్‌ను కలిసి వారిలో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ఒక వైపు, ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘనందన్‌రావు, అరవింద్‌లు జిల్లాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మూడు స్థానాల్లో ఒక్క స్థానంలో బీజేపీ గెలవలేదు. ఒక కాంగ్రెస్, పీఆర్టీయూ, యూటీఎఫ్లు సిట్టింగ్స్థానాలుగా ఉన్నాయి. అయినా కూడా బీజేపీ మాత్రం పట్టవదలకుండా ఎలాగైన గెలవాలనే ప్రచారం చేస్తుంది. ఎన్నికల ప్రచారం రాష్ట్ర బీజేపీ వ్యవహరాల ఇంఛార్జి సునీల్బన్సల్ముఖ్య నాయకులతో సమీక్షించారు. పార్టీ అనుబంధ విబాగాలను కూడా రంగంలోకి దింపి ప్రచారం చేయిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఆయా జిల్లాల మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర్‌రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్, సీతక్క, జూపల్లి కొండా సురేఖలో ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభల్లో మాట్లాడుతున్నారు. ఇలా ఇరువురు ఏవరికి వారు ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రచారం చేస్తుండటంతో హోరా హోరి ప్రచారం సాగుతుంది.
మరో వైపు టీచర్లు తమ సంఘం అభ్యర్థి గెలుపొందేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారమే ప్రచారానికి తుది గడువు కావడంతో ఆయా సంఘాలకు మద్దతుగా సెలవులు పెట్టి ప్రచారం చేస్తున్నారు. తమ సంఘం అభ్యర్థి గెలవడం ద్వారా ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందో వివరిస్తున్నారు. అన్ని సంఘాలు తమకున్న అనుకూలతలు, ప్రత్యర్థులు వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నారు. బయటికి ఏవరికి వారు గెలపుపై దీమాగా ఉన్నా... లోలోన మాత్రం భయం వారిని వెంటాడుతుంది. మద్దతు వచ్చినా కూడా ఓటు వేస్తారా లేదా అనే కోణంలో అంచనా వేసుకుంటున్నారు.
నేడు రేవంత్‌రెడ్డి ప్రచారం...
శాసనమండలి గ్రాడ్యుయేట్ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్అభ్యర్థి తరుఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఒకే రోజున మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. నిజామాబాద్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్రచార సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఉమ్మడి జిల్లాకు చెందిన పట్టభద్రులు, కార్యకర్తలతో ఈ సభలు ఏర్పాటు చేశారు. ప్రచార పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11.30కు నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. నిజామాబాద్ మీటింగ్ అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు మంచిర్యాలకు చేరుకుంటారు. మంచిర్యాలలో ప్రచార సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి కరీంనగర్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రసంగిస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి తరఫున ముఖ్యమంత్రి ప్రచారం చేపడుతారు.






