వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళతాం: CM రేవంత్

by Gantepaka Srikanth |

వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళతాం: CM రేవంత్

వారి సలహాలు, సూచనలతో ముందుకు వెళతాం: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణను ఆర్థిక ప్రగతి పథంలో నడిపించడానికి బృహత్తరమైన ప్రణాళికలతో, రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతున్న తరుణంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 కు హాజరవుతున్న ప్రతినిధులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా భావిస్తున్న ప్రజా ప్రభుత్వం భవిష్యత్తు ప్రణాళికలతో పాటు ఆచరణ సాధ్యమయ్యే పటిష్టమైన వ్యూహంతో తెలంగాణ రైజింగ్ విజన్ -2047 దార్శనిక పత్రాన్ని (విజన్ డాక్యుమెంట్) రూపొందించింది. ఈ దార్శనిక పత్రం రూపకల్పనలో ఎంతో మంది నిపుణులు, సంస్థలు, నిష్ణాతులు తమ సహాయ సహకారాలను అందించారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు.

తెలంగాణ సమగ్రాభివృద్ధికి తమవంతుగా ప్రభుత్వంతో కలిసి నడిచే ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు. తెలంగాణను దేశంలోనే ఒక ఉన్నత శిఖరాన నిలపాలన్న సంకల్పానికి తోడ్పాటును అందిస్తున్న పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులకు స్వాగతం. సంకల్పం మంచిదైనప్పుడు తలపెట్టిన కార్యం విజయవంతమై ఫలితాలు దక్కుతాయని బలంగా విశ్వసించే ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సదస్సులో భాగస్వాములవుతున్న ప్రతినిధులు అందించే సలహాలు, సూచనలతో లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో చిత్తశుద్ధితో పనిచేస్తుంది. సమున్నతమైన లక్ష్య సాధనలో తెలంగాణకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు.

Next Story