టోక్యో వాటర్‌ ఫ్రంట్‌‌ను సందర్శించిన సీఎం రేవంత్ ప్రతినిధి బృందం

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ‌పాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు దిగ్గ‌జ కంపెనీల నుండి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నారు.

టోక్యో వాటర్‌ ఫ్రంట్‌‌ను సందర్శించిన సీఎం రేవంత్ ప్రతినిధి బృందం
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జ‌పాన్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు దిగ్గ‌జ కంపెనీల నుండి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా నిన్న జపాన్ మెట్రోను సంద‌ర్శించ‌గా నేడు టోక్యో వాట‌ర్ ఫ్రంట్ ను సంద‌ర్శించారు. టోక్యో మ‌హాన‌గ‌రం మ‌ధ్య నుండి పారుతుంది. సుమిదా న‌ది రివ‌ర్ ఫ్రంట్ గా అభివృద్ధి చేసిన త‌ర‌వాత ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తుంది. టోక్యో న‌గ‌రం మ‌ధ్య‌లో జ‌ల ర‌వాణాకు అనుగుణంగా ఉండేలా రివ‌ర్ ఫ్రంట్ ను అభివృద్ధి చేశారు. సుమిదా నది పక్క నుంచి పొడవాటి ఫ్లైఓవర్‌, అవసరమైన చోట ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాలు టోక్యో నగర రూపురేఖలను ఎలా మార్చింది అనేదాన్ని ప్రతినిధి బృందం పరిశీలించింది. తెలంగాణ ప్ర‌భుత్వం మూసీ పున‌రుజ్జీవం ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే టోక్యో రివ‌ర్ ఫ్రంట్‌ను ప‌రిశీలిచింది.


Next Story