- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్రం నుంచి నిధులెందుకు రావట్లేదు?.. సీఎం రేవంత్ ఆరా
రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది భారీ వర్షాల(Heavy Rains)కు జరిగిన నష్టానికి కేంద్రం నుంచి నిధులు రాకపోవడంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని తక్షణమే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించించారు. భారీ వర్షాల సమయంలో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రంలో చెరువుల పరిస్థితిపైన సమగ్ర అధ్యయనం చేయాలని అన్నారు. ఇప్పటివరకు విపత్తు నిర్వహణ నిధుల కింద చేపట్టిన పనుల వివరాలతో కలెక్టర్లు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వర్షాలు, వరదల కారణంగా జరిగిన పంట నష్టం అంచనా వేసి తక్షణమే నివేదిక ఇవ్వాలని అన్నారు. గత సంవత్సరం ఏర్పాటు చేసిన వరదల సమయంలో SDRF బాగా పనిచేసిందని ప్రశంసించారు. NDRF తో పని లేకుండా ఎస్డీఆర్ ఎఫ్ సిబ్బందిలో నైపుణ్యాలు పెంచాలని అన్నారు. రాష్ట్రంలో వర్షాల కారణంగా 1052 చోట్ల 1023 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. రోడ్ల డ్యామేజ్‌పైన సమగ్ర నివేదిక తయారు చేయాలి.. హెచ్ఎండీఏ పరిధిలో చెరువుల నోటిపై వెంటనే జరగాలని చెప్పారు.






