ధాన్యం కొనుగోళ్లపై సీఎం ఫోకస్.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం

by Prasad Jukanti |

వరి, మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది.

ధాన్యం కొనుగోళ్లపై సీఎం ఫోకస్.. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో వరి ధాన్యం, మొక్క జొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇవాళ ఇన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ధాన్యం సేకరణ ఆలస్యం కావడానికి గల కారణాలను సీఎం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అకాల వర్షాల నుంచి ధాన్యం రక్షించేందుకు చర్యలు చేపట్టడంపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు వివిధ జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు.

Next Story