Yadagirigutta : యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-24 13:33:35  IST  )

తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి అలయం స్వర్ణ విమాన గోపురాన్ని(Bangaru Vimana Gopuram) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)దంపతులు గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరించా(Unveile)రు.

Yadagirigutta : యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదగిరి గుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి అలయం స్వర్ణ విమాన గోపురాన్ని(Bangaru Vimana Gopuram) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)దంపతులు గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణల మధ్య ఆవిష్కరించా(Unveile)రు. వానమామలై మఠం 31వ పిఠాధిపతి రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి స్వర్ణ విమాన గోపుర ప్రతిష్టాపన మహోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దంపతుల చేతుల మీదుగా ఆవిష్కరించారు.

మహాసంప్రోక్షణకు 40జీవనదుల జలాలతో అభిషేకించి సంప్రోక్షణ చేసి స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ క్రతువును వైదిక బృందం శాస్త్రయుక్తంగా నిర్వహించింది. స్వర్ణ విమాన గోపుర ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతుల వెంట స్థానిక ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్యలు ఉన్నారు. అద్భుత కృష్ణ శిల్పకళా వైభవంతో నిర్మితమైన యాదగిరిగుట్ట ఆలయం స్వర్ణమయ శోభితమైన బంగారు విమాన గోపురం నేటి నుంచి భక్తులు దర్శించుకోవచ్చు.

స్వర్ణ విమాన గోపురం ఎత్తు 5.05అడుగులు. వైశాల్యం 10,759చదరపు అడుగులు. 68కిలోల బంగారంతో విమాన గోపురాన్ని స్వర్ణ రేకులతో 3.80కోట్లతో స్వర్ణ తాపడం చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68కిలోల బంగారం, గోల్డ్ ప్లేటింగ్ తయారీ, అమరిక పనులుకు రూ.8కోట్లు వెచ్చించారు. మార్చి 1నుంచి జరిగే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముందే స్వర్ణ విమాన గోపురం ప్రతిష్టాపన పనులు పూర్తయ్యాయి.

స్వర్ణ విమాన గోపురంపై ఉన్న నృసింహ అవతారాలు, విష్ణుమూర్తి, లక్ష్మీ(ఆండాళ్ అమ్మవారు), గరుడమూర్తులు భక్తులకు స్వర్ణమయంగా కనువిందు చేయనున్నాయి. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 1నుంచి ప్రారంభమై 23వరకు కొనసాగుతాయి. 8న స్వామి అమ్మవార్ల కల్యాణోత్సం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో స్వామివారికి అలంకార, వాహన సేవలు ఘనంగా నిర్వహిస్తారు.


Next Story