CM Revanth Reddy: యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన సీఎం

by Prasad Jukanti |

యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

CM Revanth Reddy: యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ బ్రోచర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరించిన సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అంతర్జాతీయ ప్రమాణాలతో పోలీసుల పిల్లలకు విద్యాభ్యాసం అందించేందుకు ఉద్దేశించిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (Young India Police School) బ్రోచర్, వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆవిష్కరించారు. ఇవాళ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో స్కూల్ బ్రోచర్, వెబ్ సైట్ ను సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్కూల్ విద్యార్థుల కోసం సిద్ధం చేసిన యూనిఫామ్ నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ స్కూల్ దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని విద్యా విధానంలో కొత్త ఒరవడి తీసుకురావాలన్నారు. క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ అమరుల కుటుంబాల పిల్లలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాగా రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ భవనానికి గతేడాది సీఎం శంకుస్థాపన చేశారు. పోలీసుల పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేలా నాణ్యమైన విద్యను అందించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.

దరఖాస్తులకు అవకాశం:

205-26 విద్యాసంవత్సరానికి 1 నుంచి 5వ తరగతిలో చేరేందుకు దరఖాస్తు (Admissions) చేసుకునే అవకాశం కల్పించారు. ఈ స్కూల్ లో 50 శాతం పోలీస్ కుటుంబాల పిల్లలకు, మిగిలిన సీట్లను ఇతరులకు కేటాయించనున్నారు. అధికార వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. పూర్తి వివరాలకు 90591 96161 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Next Story