- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Talli Statue : సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Talli Statue) ఆవిష్కరించబడింది.

దిశ, వెబ్ డెస్క్ : సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Talli Statue) ఆవిష్కరించబడింది. వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో వేలాదిగా తరలి వచ్చిన ప్రజల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహం గుండుపూసలు, హారం, ముక్కు పుడక, ఆకుపచ్చని చీర, మెట్టెలు, కడియాలతోపాటు.. చేతిలో వరి, జొన్న, సజ్జలు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ తదితరులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా నవంబర్ 14 నుంచి నేటి వరకు ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో చివరి రోజైన నేడు మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని నేడు సీఎం ఆవిష్కరించారు. మరి కొద్దిసేపట్లో విజయోత్సవాల బహిరంగ సభ జరగనుంది.






