CM Revanth Reddy: మేడారం మహాజాతర 2026 పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

by Prasad Jukanti |   (  Updated:2025-12-21 08:22:03  IST  )

మేడారం మహాజాతర పోస్టర్ ను సీఎం ఆవిష్కరించారు.

CM Revanth Reddy: మేడారం మహాజాతర 2026 పోస్టర్ ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిచెందిన మేడారం మహాజాతరకు (Medaram Maha Jathara) సంబంధించిన పోస్టర్‍ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవిష్కరించారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. 2026 జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాజాతరను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మేడారం మాస్టర్ ప్లాన్‍తో సమ్మక్క, సారలమ్మ (Sammakka Saralamma) గద్దెల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. రాతి కట్టడాలతో ఆదివాసీ గిరిజన సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా గద్దెలు రూపుదిద్దుకుంటున్నాయి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతరను ఎలాంటి లోటు పాట్లు లేకుండా నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Next Story