- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాతీయ భాషపై చర్చ వేళ.. మా రాష్ట్రం అందరినీ ఆహ్వానిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
దేశవ్యాప్తంగా జాతీయ భాషపై తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో : దేశవ్యాప్తంగా (national language) జాతీయ భాషపై తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. మహారాష్ట్రాలో మరాఠీ, కర్ణాటకలో కన్నడ, తమిళనాడులో తమిళం నేర్చుకోవాలని ఆయా ప్రాంతాల్లో ఇతర భాషలు మాట్లాడే వారిపై ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే. భాషల మధ్య చర్చలు జరుగుతుండగా తెలంగాణకు భాష, కులం, మతం సంబంధం లేకుండా ఎవరైనా రావొచ్చు అనే సంకేతాలను తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది. తాజాగా తెలంగాణ రైజింగ్-2047 పేరుతో వివిధ భాషల లిపితో కూడిన తెలంగాణ మ్యాప్ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అందులో తెలుగు హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళం, కన్నడ, ఫ్రెంచ్, స్పానిష్, జపనీస్ వంటి వివిధ దేశాలలోని భాషలతో ‘స్వాగతం’ అని రాసి ఉంది. (Hyderabad welcomes everyone) ‘హైదరాబాద్ అందరినీ ఆహ్వానిస్తోంది’ అని పోస్టర్ టైటిల్‌తో పాటు తెలంగాణ రైజింగ్ -2047 లోగో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో పోస్టర్ విడుదల అయింది.
భాష పేరుతో రాజకీయాలు నడుస్తున్న వేళ..
పెట్టుబడులు, వ్యాపారం, జాబ్, చదువు, సెటిల్ అవ్వడానికి, ట్రావెల్ చేయడానికి హైదరాబాద్‌కి రావొచ్చని పోస్టర్‌లో అర్థమవుతుంది. అలాగే ‘మీరు ఏ భాష మాట్లాడినా, ఏ దుస్తులు ధరించినా, ఎవరితో నివసిస్తున్నా, మీరు నమ్మే విశ్వాసం ఏదైనా.. కూడా హైదరాబాద్ మిమ్మల్ని స్వాగతిస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ పోస్టర్ వైరల్ అవ్వడంతో అంకిత్ కుమార్ అవస్థి (@kaankit) అనే యూజర్ ఎక్స్ వేదికగా ఫొటోను షేర్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. భాష పేరుతో రాజకీయాలు నడుస్తున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చొరవ ఎంతో ఉత్తేజకరమైందని పేర్కొన్నారు.
వరల్డ్ వైడ్‌గా స్వాగతం పలుకుతున్నాం..
లేబర్, ట్యాలెంట్ అనేది భాషపై ఆధారపడి ఉండని, ఆర్థిక అభివృద్ధే అవసరమని సీఎం రేవంత్ ఆర్ధం చేసుకున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఎక్స్ వేదికగా ఆ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు. మొదట అంకిత్ కుమార్ అవస్థి యూజర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ, హైదరాబాద్ ఎల్లప్పుడూ దేశమే కాదు ప్రపంచంలోని ప్రతి ప్రాంతం నుంచి వచ్చిన ప్రజలందరినీ స్వాగతించడానికి సిద్ధంగా ఉందని సీఎం పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసించారు.






