ఢిల్లీకి సీఎం.. రేపు సీడబ్ల్యూసీ మీటింగుకు హాజరు

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

ఢిల్లీకి సీఎం.. రేపు సీడబ్ల్యూసీ మీటింగుకు హాజరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. శనివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో ఉదయం ఈ సమావేశం నిర్వహించనున్నారు. కాగా.. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు, పార్టీ కీలక నాయకులు పాల్గొననున్నారు. కాగా.. సీఎం రేవంత్‌రెడ్డి శని, ఆదివారాల్లో ఢిల్లీలోనూ ఉండనున్నారు. శనివారం సీడబ్ల్యూసీ మీటింగుకు హాజరయ్యాక, ఆదివారం వివిధ పెద్దలను కలిసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాటికి హాజరుకానున్నారు.

Next Story