TG Municipal Election: సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేసేది ఆ స్కూళ్లోనే

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.

TG Municipal Election: సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేసేది ఆ స్కూళ్లోనే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ నేపథ్యంలో ఓటు హక్కును వినియోగించునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్వగ్రామానికి వెళ్లనున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల(బాలురు)లో ఉదయం 11.30 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వస్తారు. మరోవైపు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని 2996 వార్డుల్లో.. మొత్తం 52లక్షల 43వేల 221 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. తెలంగాణవ్యాప్తంగా మొత్తం 8203 పోలింగ్ స్టేషన్లలో 1302 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఈ పోలింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేయడంతోపాటు ఫ్లైయింగ్ స్క్వాడ్‌ను అందుబాటులో ఉంచారు. మిగతా పోలింగ్ కేంద్రాల వద్ద ఎంతవరకు పోలీసు బలగాలు అవసరమో, అంతే స్థాయిలో తగిన కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. ఫారెస్ట్, ఎక్సైజ్, లీగల్ వివిధ శాఖలతోపాటు సీఐడీ, ఏసీబీ ఇలా వివిధ శాఖల సమన్వయంతో పనిచేస్తున్నట్టు డీజీపీ తెలిపారు.

Next Story