- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : రేపు పాశమైలారం ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారం(PashaMylaram) పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 13 మంది చనిపోగా.. మరో 35 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు(Pathancheru)లో పాశమైలారం(PashaMylaram) పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమ(Sigachi Chemical Industry)లో రియాక్టర్ పేలిన(Reactor Exploded) ప్రమాదంలో 14 మంది చనిపోగా.. మరో 35 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా సిగాచీ ప్రమాద స్థలాన్ని రేపు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించనున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఘటనాస్థలిని సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి, అనంతరం పేలుడులో మరణించిన కార్మిక కుటుంబాలను కలిసి ఓదార్చనున్నారు. అలాగే పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా సీఎం రేవంత్ రేపు పరామర్శించనున్నారు.
కాగా ప్రమాదం గురించి మంత్రి దామోదర రాజనరసింహతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ప్రమాద స్థలాన్ని సందర్శించి, బాధిత కుటుంబాలను కలిసి మాట్లాడాలని సీఎం రేవంత్ ఆదేశించగా.. మంత్రి దామోదర హుటాహుటిన సంగారెడ్డి నుంచి పాశమైలారం బయల్దేరినట్టు సమాచారం.






