- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓయూ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించనున్నారు.

దిశ, వెబ్ డెస్క్: గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana Chief Minister Revanth Reddy) ఈ రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని (Osmania University) సందర్శించనున్నారు. వర్సిటీలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం ఇప్పటికే రూ. 1000 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో, నేడు ఆర్ట్స్ కాలేజీ భవనం వద్ద ఉదయం 11 గంటలకు "సర్వం సిద్ధం" పేరుతో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించనున్నారు. వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.
ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అకడమిక్ బ్లాక్‌లు, హాస్టళ్లు, ఇతర విద్యార్థి సౌకర్యాలను పరిశీలించి, అభివృద్ధి పనులపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. విద్యార్థులు, అధ్యాపకుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇస్తూ, వర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధమని సీఎం గతంలోనే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, నేటి పర్యటన ఓయూ చరిత్రలో మరో కీలక ఘట్టంగా నిలవనుంది.






