- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు కొడంగల్‌కి సీఎం రేవంత్.. సర్పంచ్, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24 (రేపు) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కి వెళ్లనున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24 (రేపు) తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కి వెళ్లనున్నారు. సీఎం పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో సీఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి చర్చ జరపనున్నారు.
గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు అంశాలపై సీఎం చర్చించే అవకాశం ఉంది. అలాగే వారితో కలిసి భోజనం (లంచ్) చేయనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. కాగా, సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భద్రతా చర్యలతో పాటు కార్యక్రమ నిర్వహణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది.
READ MORE ....
CM Revanth Reddy: నూతన సర్పంచ్ లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
Next Story






