- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: నూతన సర్పంచ్ లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
మంచి పాలన అందించాలని నూతన గ్రామ పాలకలవర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి సర్పంచ్‌లుగా, ఉప సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా నిన్న బాధ్యతలు స్వీకరించిన సంగంతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ కొత్త పాలక వర్గాలకు సీఎం రేవంత్ రెడ్డి (CM RevanthReddy) ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. 'సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లుగా బాధ్యతలు స్వీకరించిన సోదర సోదరీమణులకు నా శుభాకాంక్షలు. మంచి పాలన అందించి, పంచాయతీలను ఆదర్శవంమైన గ్రామాలుగా తీర్చిదిద్ది, మీరంతా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పలపరిచిన అభ్యర్థులు సత్తా చాటారు. అధికార కాంగ్రెస్ పార్టీకి మూడింట రెండొంతుల సీట్లు దక్కాయి. పల్లెప్రజలు పట్టం కట్టడంతో క్షేత్రస్థాయిలో తమ ప్రభుత్వానికి ప్రజల ఆమోదం ఉందని అధికా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
READ MORE ....
రేపు కొడంగల్‌కి సీఎం రేవంత్.. సర్పంచ్, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం






