- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: 24న కొడంగల్‌కు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
by Ramesh Naini |
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 24న తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో ఇటీవల గెలుపొందిన సర్పంచ్‌లతో సీఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి చర్చ జరపనుండగా, గ్రామాల అభివృద్ధి, స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు అంశాలపై చర్చలు జరపనున్నట్లు సమాచారం. అలాగే సర్పంచ్‌లతో కలిసి భోజనం చేయనుండటం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సీఎం పర్యటనకు సంబంధించి అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యలతో పాటు కార్యక్రమ నిర్వహణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
Next Story






