నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక..

నేడు కేరళకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు కేరళ పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక.. సభలో ప్రవేశపెట్టే బిల్లులపై చర్చలు ప్రారంభిస్తారు. అనంతరం ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి కేరళలోని కొచ్చికి పయనమవుతారు. కొచ్చి నుంచి హెలికాప్టర్లో అలెప్పి చేరుకుని కేసీ వేణుగోపాల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగు పయనమై సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. వెంటనే అసెంబ్లీకి చేరుకుని పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై చర్చలో పాల్గొంటారు.

కాగా.. కాళేశ్వరం నివేదికపై నేడు అసెంబ్లీలో చర్చ జరగనుండటం హాట్ టాపిక్ గా మారింది. నిన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం మార్చి.. నేడే సభలో నివేదికను ప్రవేశపెట్టి వెంటనే డిస్కషన్ చేయాలని ప్లాన్ చేశారు. దీంతో బీఆర్ఎస్ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు తమకు సమయం ఇవ్వాలని కోరాలని యోచిస్తోంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతను చర్చకు తీసుకొచ్చి.. సభను స్తంభింపజేయాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story