రేపు సాయంత్రం ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.. డిలిమినేషన్‌పై ‘ఇండియా’ కూటమి నేతలతో చర్చలు!

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-14 05:22:30  IST  )

నియోజకవర్గాల పునర్విభజన అంశంతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లుపై హైకమాండ్‌తో సమాలోచనలు చేసేందుకు రేపు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు.

రేపు సాయంత్రం ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.. డిలిమినేషన్‌పై ‘ఇండియా’ కూటమి నేతలతో చర్చలు!
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించనున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ‘ఇండియా’ (INDIA) కూటమికి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశమయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియలో జనాభా ప్రాతిపదికన కాకుండా, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకోవాలనే డిమాండ్‌పై ఉమ్మడి పోరాటం చేసే అంశం, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. జనాభాకు 50 వాతం, జీఎస్‌డీపీ 50 శాతం తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, ఇతర అభివృద్ధి పనులపై కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ (Congress) పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్న నేపథ్యంలో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Next Story