CM Revanth Reddy : నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-25 08:55:02  IST  )

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నేడు సాయంత్రం మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ప్రధాని మోడీ(Prime Minister Modi)తో భేటీ కానున్నారు.

CM Revanth Reddy : నేడు మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)నేడు సాయంత్రం మరోసారి ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు ప్రధాని మోడీ(Prime Minister Modi)తో భేటీ కానున్నారు. ప్రధానితో భేటీలో రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల(BC Reservations)పై చర్చించనున్నారు.

అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చట్టం చేసి పంపిస్తామని..బీసీ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం సహకరించాలని ప్రధానిని సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థించనున్నారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను సైతం కలవనున్నారని సమాచారం.

మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం పెద్ధలను కూడా రేవంత్ రెడ్డి కలిసే అవకాశముంది. మంత్రివర్గ విస్తరణతో పాటు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ అధిష్టానం పెద్దలతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశముంది. మంగళవారం బయో ఏషియా సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. ప్రస్తుత ఢిల్లీ పర్యటనతో రేవంత్ రెడ్డి 36వ సారి ఢిల్లీ బాట పట్టినట్లుగా విపక్షాలు చెబుతున్నాయి.

Next Story