రైతులతో CM రేవంత్ ముఖాముఖి.. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం

by Gantepaka Srikanth |

గతేడాది మార్చి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) రైతు నేస్తం కార్యక్రమం(Rythu Nestham Program) ప్రారంభించిన విషయం తెలిసిందే.

రైతులతో CM రేవంత్ ముఖాముఖి.. రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం
X

దిశ, వెబ్‌డెస్క్: గతేడాది మార్చి 6వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం(Congress Government) రైతు నేస్తం కార్యక్రమం(Rythu Nestham Program) ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహిస్తున్నారు. శాస్త్రవేత్తల సలహాలు సూచనలు, ఆదర్శ రైతుల అనుభవాలు, వ్యవసాయ రంగం(Agriculture Sector)లో వస్తున్న నూతన ఆవిష్కరణలను రైతులకు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు 57 వారాలు రైతు నేస్తం కార్యక్రమం విజయవంతంగా సాగింది. 6.35 లక్షల మంది రైతులు రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇప్పటి వరకు రైతు నేస్తం కార్యక్రమానికి 566 రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం కల్పించారు.

ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్​ సదుపాయాన్ని 1034 రైతు వేదికలకు విస్తరించనున్నారు. ఈ క్రమంలోనే నేడు రాష్ట్రవ్యాప్తంగా 1,034 రైతు వేదికల్లో ‘రైతునేస్తం’ కార్యక్రమం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు ప్రొ.జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. యూనివర్సిటీ ఆడిటోరియంలో దాదాపు 1,500 మంది రైతులు ప్రత్యక్షంగా పాల్గొంటారు. రైతు వేదికలకు హాజరైన రైతులతో(Telangana Farmers) ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడుతారు. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.

Next Story