- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసేపట్లో ఓయూకు CM రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్వీ నేతల ముందస్తు అరెస్ట్
నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిసరాల్లో హై అలర్ట్ నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) పరిసరాల్లో హై అలర్ట్ నెలకొంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఓయూకి వెళ్తున్న సీఎంగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అరుదైన ఘటన సాధించనున్నారు. ఈ సందర్భంగా ఆయన యూనివర్సిటీ పరిధిలోని రూ.80 కోట్లతో హాస్టల్ భవనాలను ప్రారంభించనున్నారు. దీంతో 1,200 మంది విద్యార్థులకు వసతి సదుపాయం లభించనుంది. అదేవిధంగా ఫెలోషిప్ (Fellowship) పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. మరో రెండు గిరిజన హాస్టళ్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు. అనంతర ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అయితే, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఓయూ క్యాంపస్ పరిసరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్‌వీ (BRSV) నేతలను ముందస్తు అరెస్ట్ చేశారు. ఇక ఓయూకి వెళ్లే మార్గంలో ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేశారు. క్యాంపస్ పరిధిలో భారీగా పోలీసులను మోహరించారు.






