గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-11 08:31:01  IST  )

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ రాత్రి 8 గంటలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో భేటీ కానున్నారు.

గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలవనున్న సీఎం రేవంత్‌ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్ శుక్లా (Shivapratap Shukla)తో సమావేశం కానున్నారు. ఇవాళ 8 గంటలకు ఆయన లోక్‌భవన్‌ (Lok Bhavan) వెళ్లి గవర్నర్‌తో సీఎం భేటీ అవుతారని అధికారిక వర్గాలు తెలిపాయి. సాధారణంగా జరిగే మర్యాదపూర్వక భేటీ అయినప్పటికీ, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పెండింగ్‌లో ఉన్న కీలక ఫైళ్ల గురించి గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ సమావేశాలు, ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కొత్త బిల్లుల గురించి ప్రాథమికంగా చర్చిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఇద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది.

బండి భగీరథ్ వ్యవహారంపై CM రేవంత్ సీరియస్.. తక్షణ విచారణకు ఆదేశం

Next Story