కాసేపట్లో జార్ఖండ్కు సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే

by Kema Shiva Kumar |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు.

కాసేపట్లో జార్ఖండ్కు సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ జార్ఖండ్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు ఆయన దివంగత మాజీ సీఎం శిబూ సోరెన్ (Shibu Soren) ఏకాదశ దినకర్మకు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి నేరుగా జార్ఖండ్‌కు చేరుకోనున్నారు. అనంతరం అక్కడ సంతాప సభలో పాల్గొని సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. కాగా, ఈ నెల 4న జార్ఖండ్ మాజీ సీఎం, జార్ఖండ్‌ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో ఒకరైన శిబూ సోరెన్ (81) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతోన్న ఆయన జూన్ చివరి వారంలో ఢిల్లీలోని గంగారామ్‌ ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఈ నెల 4న ఉదయం 8.56 నిమిషాలకు శిబూ సోరెన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

Next Story