- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు వ్యవసాయ యూనివర్శిటీలో వనమహోత్సవం ప్రారంభించనున్న సీఎం రేవంత్రెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం నేడు ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వనమహోత్సవం రేపు ఉదయం 9 గంటలకు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈకార్యక్రమంలో అటవీ శాఖా మంత్రి కొండా సురేఖతో పాటు అటవీ దళాల ప్రధానాధికారి డా. సువర్ణ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. ప్రకృతి విధ్వంసం నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు చేపట్టిన బృహత్తర కార్యక్రమం. ప్రతీ ఏడాది రుతుపవనాలు అధికంగా వచ్చే జూలై మొదటి వారంలో ఈ పండుగను మొదలు పెట్టడం జరిగింది.
గత ఏడాది ఇదే మాసంలో హన్మకొండలో ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ప్రజాప్రతినిధులు,అధికారులు విద్యార్థులు, ప్రజలు అందరూ ఈ వనమహోత్సవం కార్యక్రమంలో భాగస్వాములు అవుతారు.
- Tags
- CM Revanth Redy
Next Story






