- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేడు స్వగ్రామానికి సీఎం రేవంత్ రెడ్డి.. అసలు విషయం ఇదే!
రాష్ట్రంలో గిరిజన రైతుల ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కొత్త పథాకానికి శ్రీకారం చుట్టబోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో గిరిజన రైతుల ఆర్థిక ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కొత్త పథాకానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు ఇవాళ అభివృద్ధి పనుల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో పర్యటించనున్నారు. అమ్రాబాద్ మండల పరిధిలోని మాచారం (Macharam) గ్రామంలో రూ.12,600 కోట్ల బడ్జెట్‌తో ‘ఇందిర సౌర గిరి జల వికాసం’ (Indira Soura Giri Jala Vikasam) పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం గిరిజన రైతులను సోలాల్ పంపు సెట్లను పంపిణీ చేయనున్నారు. ఇందులో ఒక్కో యూనిట్‌పై రూ.6 లక్షల మేర వంద శాతం సబ్సిడీతో లబ్ధిదారులు బెనిఫిట్ పొందనున్నారు. ఆ తర్వాత సీతారామాంజనేయ ఆలయాన్ని దర్శించుకుని బహిరంగ సభలో పాల్గొననున్నారు. తిరుగు ప్రయాణంలో సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లె (Kondareddy Palle)కు వెళ్లి అక్కడ గ్రామస్థులతో ముచ్చటించనున్నారు. అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు చేరుకోనున్నారు.






