- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ ఢిల్లీ! పర్యటన వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం. మెట్రో ఫేజ్-2 అనుమతులతో పాటు ఏఐసీసీ పెద్దలతో కేరళ రాజకీయాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. మెట్రో ఫేజ్-2 అనుమతుల కోసం ఢిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పనులుకు సంబంధించి వారికి విజ్ఞప్తులు చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలతోనూ ముఖ్యమంత్రి సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కేరళలో యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కేరళకు కాబోయే సీఎం ఎవరు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా సీఎం రేస్‍లో ప్రధానంగా వినిపిస్తోంది. కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన ఆసక్తిని రేపుతోంది.
‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై దుమారం.. మంత్రి కొండా సురేఖపై బీజేపీ ఫైర్






