- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రేపు ఉదయం ఢిల్లీకి (Delhi tour) బయలుదేరి వెళ్లనున్నారు. నూతన సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ (CJI Suryakant) రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం హాజరుకాబోతున్నారు. జస్టిస్ సూర్యకాంత్ 1962లో హర్యానాలో జన్మించారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డుకెక్కబోతున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు. మరో వైపు ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ రేపు పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ టూర్ లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలను, కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తారా అనేది తెలియాల్సి ఉంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలతో సమావేశం అయి వారితే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.






