- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం హస్తినకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇవాళ దేశ రాజధాని ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నారు. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమవ్వనున్న ఆయన, ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఆ భేటీల్లో రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, విభజన హామీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపై సీఎం చర్చించనున్నారు.
ఇప్పటికే గత పర్యటనల్లో హోం మంత్రి అమిత్ షా (Amit Shah) వంటి కీలక నేతలను కలిసి రాష్ట్ర భద్రత, ఐపీఎస్ అధికారుల సంఖ్య పెంపుపై చర్చించిన సీఎం, తాజా పర్యటనలో మరికొన్ని శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి పనుల విషయంలో వినతులు సమర్పించారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సన్నద్ధత, ఇతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేపు తిరిగి హైదరాబాద్‌కు చేరుకునే అవకాశం ఉంది.






