BREAKING: తెలంగాణలో సీఎం రేవంత్ బహిరంగ సభలు.. మంత్రి పొంగులేటికి బాధ్యతలు

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్ రెడ్డి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది.

BREAKING: తెలంగాణలో సీఎం రేవంత్ బహిరంగ సభలు.. మంత్రి పొంగులేటికి బాధ్యతలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు అతి త్వరలోనే జరగనున్న నేపథ్యంలో.. అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు నేడు గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ, పీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి 9 ఉమ్మడి జిల్లాల్లో బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 3 నుంచి 9వ తేదీ వరకూ సీఎం బహిరంగ సభలు జరగనున్నాయి. బహిరంగ సభల బాధ్యతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కు అప్పగించారు. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ లో తొలి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.

Next Story