- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు ఓయూకు సీఎం రేవంత్ రెడ్డి!
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్టు సమాచారం.

X
దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి రేపు ఉదయం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లనున్నట్టు సమాచారం. సోమవారం ఉదయం 11 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలో కొత్తగా నిర్మించిన హాస్టళ్ల ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొననున్నారు. అలాగే వర్సిటీలోని వివిధ భవన నిర్మాణాల భూమిపూజలో పాల్గొంటారు. కాగా ఈనెల 21 జరిగిన పీహెచ్డీ విద్యార్థులు పట్టాల పంపిణీ కార్యక్రమంలోనే పాల్గొనాల్సి ఉండగా.. అదే రోజు ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ కార్యక్రమానికి వెళ్లాల్సి ఉన్న కారణంగా గైర్హాజరు అయ్యారు. అయితే చివరి నిముషంలో ఆరోజుటి సీఎం ఢిల్లీ పర్యటన కూడా రద్దయింది. ఓయూ కార్యక్రమం అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై న్యాయకోవిదులతో చర్చించనున్నారు.
Next Story






