- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌చార్జి మంత్రులపై సీఎం సీరియస్.. అక్కడ ఉపఎన్నికపై స్పెషల్ ఫోకస్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ కు బాధ్యతలు అప్పగించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఫోకస్ పెట్టారు. అందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ కు బాధ్యతలు అప్పగించారు. వీరంతా రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటించడం, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలి. అయితే నియోజకవర్గంలో పార్టీ గ్రాఫ్ ఆశించిన స్థాయిలో పెరగడం లేదని నిఘావర్గాలు రిపోర్టులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. దీంతో సీఎం రేవంత్ ఇన్ చార్జి మంత్రులకు ఫోన్ చేసి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం పార్టీ శ్రేణులను ప్రిపేర్ చేయడంలో ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక నుంచి కేవలం నియోజకవర్గంపై మాత్రమే ఫోకస్ పెట్టాలని దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. అందుకోసం క్షేత్రస్థాయిలో లీడర్లు, కేడర్ తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించినట్లు సమాచారం.
సీరియస్ గా తీసుకోని మంత్రులు
జూన్ 9న ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. అక్టోబర్ చివర వారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీ విజయం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు. ముందుగా నియోజకవర్గంలో కేడర్ బలోపేతం చేయడం, అదే సమయంలో స్థానిక సమస్యలను పరిష్కరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అందుకోసం ముగ్గురు మంత్రులకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించారు. వారిలో ఒకరిద్దరు మంత్రులు మాత్రమే అడపాదడపా నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, మిగతా టైమ్ అటు వైపు వెళ్లడం లేదని ఫిర్యాదులు వెళ్లాయి. స్థానిక సమస్యలను పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులతో మాట్లాడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ‘ఇప్పట్నించి నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టండి. కేడర్, లీడర్లతో రెగ్యలర్ గా మీటింగ్ పెట్టండి. స్థానిక సమస్యలను పరిష్కరించండి. అక్కడ గెలుపు పార్టీకి చాలా అవసరం.’ అని హితబోధ చేసినట్లు తెలిసింది.
ప్రజాసమస్యల పరిష్కారం
మంత్రుల పనితీరుపై స్వయంగా సీఎం అసంతృప్తి వ్యక్తం చేయడంతో ముగ్గురు మంత్రులు శనివారం జూబ్లీహిల్స్ పై దృష్టి సారించారు. మంత్రులు తుమ్మల, పొన్నం, వివేక్ నియోజకవర్గం కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల వద్దకు వెళ్లాలని సూచించారు. అందుకోసం ఒక్కో డివిజన్ కు ప్రత్యేకంగా రెండు మూడు టీమ్ లు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు వెంటనే దృష్టి సారించాలని ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ, రోడ్ల మరమ్మతు, స్ట్రీట్ లైట్స్ సమస్యలు లేకుండా ఫాలో ఆప్ చేయాలని చెప్పారు.






