- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SLBC: ఎస్ఎల్బీసీ ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. అధికారులకు ప్రత్యేక హెలికాప్టర్
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్‌లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరారు.
కాగా, శనివారం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. టన్నెల్ పైభాగం మూడు మీటర్ల మేర పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. ఇంకా కొంత మంది కార్మికులు లోపల ఉన్నట్లు తెలుస్తోంది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు ఘటనా స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.






