ప్రధాని మోడీ బీసీ కాదు.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోడీ బీసీ కాదు.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Modi) కులంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్‌(Gandhi Bhavan)లో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని.. కన్వర్టెడ్ అని అన్నారు. 2002 వరకు ఉన్నత వర్గాల్లో మోడీ ఉండేవాళ్లని.. మోడీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ప్రధాని మోడీ కులం(Modi Caste) గురించి ఆషామాషీగా చెప్పడం లేదు.. అన్నీ తెలుసుకునే మాట్లాడుతున్నానని అన్నారు. ఇక మీరే ఆలోచించుకోండి అని ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాం. పేదల ఆత్మగౌరవం కోసం ఇళ్లు కట్టిస్తున్నాం. డబుల్‌ బెడ్‌రూమ్‌ పేరుతో కేసీఆర్‌ ప్రజలను మోసం చేశారు. ఆయన మోసం చేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో యూత్‌ కాంగ్రెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు ఇస్తాం. ఫ్లెక్సీలు కట్టి దండాలు పెట్టేవారికి పదవులు రావు. ఢిల్లీ నుంచి కాదు.. గల్లీ నుంచి వచ్చిన వారికే పదవులు ఇస్తాం. దేశంలోనే ఎవరూ చేయనంత రుణమాఫీ తెలంగాణ రైతాంగానికి చేశాం.

బీఆర్ఎస్ పార్టీ ఒక దొంగల ముఠా అని మండిపడ్డారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత, పోచంపల్లి వంటి దొంగలంతా అందులోనే ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు.

Next Story