గుండెల్లో దమ్ము, ధైర్యం ఉన్నోడే యుద్ధంలో గెలిపిస్తాడు.. మోడీలో అది కనిపించలేదు.. రెచ్చిపోయిన CM రేవంత్

by Gantepaka Srikanth |   (  Updated:2025-05-29 12:52:09  IST  )

తనపై కుట్ర చేసి 2018 ఎన్నికల్లో ఓడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు.

గుండెల్లో దమ్ము, ధైర్యం ఉన్నోడే యుద్ధంలో గెలిపిస్తాడు.. మోడీలో అది కనిపించలేదు.. రెచ్చిపోయిన CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: తనపై కుట్ర చేసి 2018 ఎన్నికల్లో ఓడించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బాచుల్లిలో భారత సైన్యానికి మద్దతుగా ‘జైహింద్ ర్యాలీ’ నిర్వహించారు. ఈ సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 2018లో కొడంగల్‌లో కుట్ర చేసి ఓడించినా.. ఆ వెంటనే మల్కాజ్‌గిరి ప్రజలు ఎంపీగా గెలిపించి తనను లోక్‌సభకు పంపించారని అన్నారు. ఇవాళ నేను సీఎంగా ఉన్నానంటే కార్యకర్తల కఠోర శ్రమే అని తెలిపారు. కార్యకర్తలు వారి చెమటను రక్తంగా మార్చి తనను గెలిపించారని అన్నారు. పెహల్గాంలో మన దేశ పౌరులపై తూటాలు పేల్చిన దేశాన్ని తుడిచేయాలని ప్రధాని మోడీని అనేక సార్లు కోరాం.. దేశ భద్రత విషయంలో అంతా ఒక్కటే అని సంకేతాలు ఇచ్చామని తెలిపారు. పాకిస్తాన్‌(Pakistan)కు మోడీ తగిన గుణపాఠం చెబుతారనే ఉద్దేశంతోనే మద్దతిచ్చాం.. కానీ నాలుగు రోజుల యుద్ధం తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. అర్ధాంతరంగా యుద్ధం ఆపేశారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్(US President Trump) మీడియా ముందుకు వచ్చి స్వయంగా తానే యుద్ధం ఆపానని ప్రకటించుకున్నారు.

అసలు యుద్ధం ఆపే ఆలోచన ఉన్నప్పుడు అఖిలపక్షంతో ఎందుకు చర్చించలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గుండెళ్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధంలో గెలిపిస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇందిరా గాంధీ తన ధైర్య సాహసాలను చూపించింది. పాకిస్తాన్‌కు చుక్కలు చూపించింది. చైనాను మోకాళ్లపై కూర్చోబెట్టిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. కానీ.. మోడీ ఇందుకు భిన్నంగా ప్రవర్తించారని విమర్శించారు. ట్రంప్‌కు భయపడి యుద్ధం ఆపేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రత అనేది ప్రధాని మోడీ సొంత నిర్ణయం కాదని అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌కు మోడీ తాకట్టు పెట్టాడని మండిపడ్డారు. పీవోకే(POK) స్వాధీనం చేసుకుంటనే సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని.. తమతో పాటు దేశం మొత్తం ముక్త కంఠంతో చెప్పింది.. అయినా కేంద్రం వినలేదు. బెలూచిస్తాన్‌ను విడగొట్టి మరో దేశంగా చేయాలని కోరాం.. అయినా పెడచెవిన పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడం చేతకాదు కానీ.. కాంగ్రెస్‌పై మాత్రం విమర్శలు చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి రెచ్చిపోయారు.

Next Story