కేసీఆర్ చెల్లని నోటుతో సమానం : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-06-05 12:09:26  IST  )

కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాలపై ఏపీతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే శుభవార్త వస్తుందని తెలిపారు.

కేసీఆర్ చెల్లని నోటుతో సమానం : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన రద్దయిన రూ.1000 నోటు వంటి వారన్నారు. బీఆర్ఎస్ కు గతమే తప్ప, భవిష్యత్ లేదని, ఆ పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలు, విమర్శలకు పైసా విలువలేదని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులన్నింటినీ తామే కట్టినట్లు చెప్పుకుంటున్న బీఆర్ఎస్.. ఒక్క ప్రాజెక్టునైనా మొదలు పెట్టి పూర్తి చేసిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు.. ప్రాజెక్టులను పూర్తి చేయడం కంటే ప్రాణిహిత - చేవెళ్ల ప్రాజెక్టు పేరు మార్చి, ఊరుమార్చి దోపిడీ చేయడమే తెలుసని విమర్శించారు. కేసీఆర్ సొంతంగా మొదలుపెట్టి.. చేపట్టిన ప్రాజెక్టురాష్ట్రంలో ఒక్కటీ లేదన్నారు. కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టుల విషయంపై అసెంబ్లీలోనే చర్చిద్దామని, నిజానిజాలు అందరికీ తెలుస్తాయన్నారు.

త్వరలోనే గుడ్ న్యూస్..

కృష్ణా, గోదావరి జలాలపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీటి పంపకాలపై ఏపీతో చర్చలు జరుపుతున్నామని, త్వరలోనే శుభవార్త వస్తుందని తెలిపారు. తెలంగాణకు రావలసిన చుక్కనీటిని కూడా వదులుకోబోమన్నారు. తాను పంచాయతీ కంటే పరిష్కారానికే ప్రాధాన్యమిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు, డిండి వంటి ప్రాజెక్టులకు NOCలు వస్తేనే మిగతా ప్రాజెక్టులపై చర్చిస్తామని స్పష్టం చేశారు.

త్వరలోనే శుభవార్త చెబుతాం: సీఎం రేవంత్

Next Story