- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: ఏపీ వల్లే సమస్య.. చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్
బనకచర్ల ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పోలవరం-బనకచర్ల (Banakacharla) లింక్ ప్రాజెక్టు వివాదం వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబుతో (CM Chandrababu Naidu) చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ అక్కడ మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని, తన మొదటి ప్రాధాన్యత చర్చలు జరపడమేనన్నారు. చర్చల ద్వారానే నీటి వివాదాల పరిష్కారం అవుతాయన్నారు. ఈ విషయంలో తనకెలాంటి భేషజాలు లేవన్నారు. ఏపీతో చర్చలకు తామే ఒకడుగు ముందుకేస్తామని, అవసరమైతే ఏపీ సీఎంను తానే ఆహ్వానిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఆఫ్ఆర్) ఇవ్వడం వల్లే వివాదం మొదలైందని, ఆ రిపోర్టు ఇచ్చే ముందు తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు. చర్చలపై విమర్శలు వచ్చినా పట్టించుకోనని, మోడీ సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు సపోర్టు కావాలన్నారు. చంద్రబాబు అధికారంలోకి రావాలంటే గోదావరి నీటిని తరలింపే ముఖ్యమన్నారు. జులై 6,7 తేదీల్లో మళ్లీ ఢిల్లీకి వెళ్తానని చెప్పారు.
మంత్రివర్గంలో చర్చించాకే నిర్ణయం
ఈ నెల 23న రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉందని, ఈ భేటీలో బనకచర్లపై చర్చిస్తామని సీఎం చెప్పారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, రాష్ట్రాల మధ్య వ్యవహారం అని అన్నారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టుల్లో మార్పులు చేస్తే చెప్పుకోవాలని, విభజన చట్టం ప్రకారం గతంలో సీఎంల స్థాయిలో చర్చలు జరిపామని గుర్తు చేశారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దన్నారు. కింది రాష్ట్రంగా ఏపీకి హక్కులు ఉన్నాయంటున్నారు. అదే రకమైన హక్కులు తెలంగాణకు కూడా ఉంటాయన్నారు. ప్రాజెక్టులకు నీళ్లు ఉపయోగించాకే మిగిలిన నీళ్లలో వరద నీళ్లు ఎంత అనేది తేలుతుందని తెలిపారు. బనకచర్లపై ఒక్క రోజు కాదు నాలుగు రోజులైనా కూర్చుని చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవరి కోసమో తమ హక్కులను వదులుకోబోమని స్పష్టం చేశారు. ఏపీ పీఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం కూడా స్పందిస్తోందని, మాతో చర్చించకుండానే అన్ని రకాలు చర్యలకు సిద్ధమైందన్నారు. కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడం మంచిదని, ఈ వివాదం పరిష్కారానికి ఎలాంటి డెడ్ లైన్ లేదన్నారు.
ఏపీ ప్రభుత్వ వైఖరి బీఆర్ఎస్‌కు ఆయుధం
ఏపీ ప్రభుత్వ వైఖరి బీఆర్ఎస్‌కు (BRS) ఆయుధంలా మారిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజకీయంగా బతకడానికి జలాలను రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఇంతకాలం బతికిందని, ఇప్పుడు రాజకీయంగా చచ్చిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు జలాల పేరుతో పునరుజ్జీవం కోసం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ గెలవాలంటే గోదావరి నీటిపై రాజకీయం చేయాలని, అందుకే ఆ పార్టీ రాద్దాంతం చేస్తున్నదని ధ్వజమెత్తారు.
కిషన్‌రెడ్డికి ట్యూషన్ మాస్టర్ కేటీఆర్
బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే ఎన్నికల్లో బీజేపీ (BJP) 8 ఎంపీ స్థానాలు గెలిచిందని సీఎం ఆరోపించారు. కిషన్‌రెడ్డికి (Kishan Reddy) కేటీఆర్ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్ అని, బీఆర్ఎస్ కోసమే కిషన్‌రెడ్డి పని చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కోసం పని చేసినందుకే మెదక్‌లో బీఆర్ఎస్ ఓడిందని, బీఆర్ఎస్ అబద్ధాలకు దేవుడు కూడా ఆశ్చర్యపోతాడని సెటైర్ వేశారు.






