- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ పుట్టుకతో ఓబీసీ కాదు : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణాలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే విధానంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజెంటేషన్ ఇస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణాలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ సర్వే విధానంపై కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రజెంటేషన్ ఇస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల(BC Reservations) వ్యవహారం, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు, పార్లెమెంటులో ఈ బిల్లు చట్టబద్ధత కోసం చర్చించాల్సిన అంశాలపై సీఎం వివరిస్తున్నారు. దేశంలో దాదాపు 100 ఏళ్ల తర్వాత కులగణన చేపట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.
దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచి పోతుందని అన్నారు. ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, అందరి సంతోషం కోసం పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని వివరించి, ఒప్పించామని పేర్కొన్నారు. ప్రధాని మోడీ(PM Modi) పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వెల్లడించారు.
ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నిర్ణయంతో, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని అన్నారు. కులగణన దేశం మొత్తం చేయాలన్న రాహుల్ పోరాటంతో కేంద్రం దిగివచ్చి, రానున్న జనాభా లెక్కలతోపాటు కులగణనకు ఒప్పుకుందని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు.
కాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ సర్వేలో 94,863 మంది ఎన్యూమరేటర్లు, 9,628 మంది సూపర్‌వైజర్లు 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్‌లలో 56 ప్రశ్నలతో ఇంటింటికీ వెళ్లి 3.55 కోట్ల మంది జనాభా (96.9%) డేటాను సేకరించారు, 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లో డిజిటలైజేషన్ పూర్తి చేశారు. సర్వే ఫలితాల ప్రకారం, రాష్ట్రంలో బీసీలు 56.4% (బీసీ ముస్లింలు 10.08%), ఎస్సీలు 17.45%, ఎస్టీలు 10.08%, ఉన్నత కులాలు 10.09%, 3.09% మంది కులం లేనివారిగా పేర్కొన్నారు.






