సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

by Naga Rani Yarlagadda |

సౌదీ బస్సుప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సౌదీ బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: సౌదీ అరేబియాలోని బదర్ - మదీనా మధ్య జరిగిన బస్సు ప్రమాదంలో 42 మంది భారతీయులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన వారు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం రావడంతో.. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్, డీజీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు సహాయం అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణ ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్, విదేశాంగశాఖ అధికారులతో మాట్లాడారు.

సచివాలయంలో కంట్రోల్ రూమ్

సౌదీ బస్సు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాల కోసం సచివాలయంలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మక్కాకు వెళ్లినవారి కుటుంబ సభ్యులు వివరాల కోసం79979 59754, 99129 19545 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

Next Story