జూబ్లీహిల్స్ మనం గెలవాలి.. గెలిచి తీరాలి: నేతలకు CM రేవంత్ దిశానిర్దేశం

by Gantepaka Srikanth |   (  Updated:2025-09-14 16:27:40  IST  )

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నేపథ్యంలో స్థానిక నాయకులు, ఇన్ ఛార్జ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు.

జూబ్లీహిల్స్ మనం గెలవాలి.. గెలిచి తీరాలి: నేతలకు CM రేవంత్ దిశానిర్దేశం
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక(Jubilee Hills By-Election) నేపథ్యంలో స్థానిక నాయకులు, ఇన్ ఛార్జ్‌లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు ప్రజా ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రచార ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. గెలుపే లక్ష్యంగా గల్లీ కార్యకర్త నుండి రాష్ట్ర నాయకత్వం(Telangana Congress) వరకు పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. అభ్యర్థి ఎంపికను అధిష్టానం చూసుకుంటుందని.. అందరూ గెలుపు కోసం పనిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Next Story