- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలోపు డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలి: CM రేవంత్
ఆలోపు డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలి: CM రేవంత్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్- 2047 పాలసీ డాక్యుమెంట్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపు, ఎల్లుండి ఈ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను మంత్రులు, సంబంధిత విభాగాల అధికారులు తమ శాఖ పరిధిలోని ప్రతి ఆంశాన్ని చర్చించి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని ఆదేశించారు. 2వ తేదీ రాత్రికి నివేదిక సమర్పించాలని అన్నారు. 3, 4వ తేదీలలో అన్ని శాఖలు ఇచ్చిన నివేదికలను సీఎస్, స్పెషల్ సీఎస్, సీఎంవో అధికారులు పరిశీలించి, అవసరమైన మార్పులు చేర్పులను చేసి.. తుది ప్రతి సిద్ధం చేయాలని చెప్పారు. 6వ తేదీ సాయంత్రం వరకు తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ సంపూర్ణంగా సిద్ధం కావాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాల అధికారులు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ రూపకల్పన కోసం పూర్తి సమయం కేటాయించాలని తెలిపారు. గ్లోబల్ సదస్సు ఏర్పాట్లు నిర్వహణలో శాఖల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు.






