- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth: బుల్లెట్ ట్రైన్ నుంచి ఇండస్ట్రియల్ లైన్ వరకు.. రైల్వే విస్తరణపై సీఎం రేవంత్ సమీక్ష

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా చేపట్టాల్సిన ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించారు. ఈ మేరకు గురువారం రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో రైల్వే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్- కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. (Industrial sector) తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండాలని అధికారులకు సూచించారు. ఇందుకు భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తెలిపారు.
రీజనల్ రింగ్ రైల్ ఆవశ్యకతను అధికారులకు సీఎం వివరించారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా కొత్త రైల్వే లైన్స్ ప్రతిపాదనలను పరిశీలించాలని సీఎం సూచించారు. శంషాబాద్ నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ కోసం కొత్తగా రైల్వే కనెక్టివిటీ అంశాన్ని పరిశీలించాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్‌తో పోలిస్తే కొత్త లైన్‌తో దూరం కూడా తగ్గుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, టీ ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






