- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Olympics 2036 : ఒలింపిక్స్–2036పై సీఎం రేవంత్ సమీక్ష.. హాజరైన క్రీడా, వ్యాపార ప్రముఖులు
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు (Telangana Sports Hub Board) మొదటి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు (Telangana Sports Hub Board) మొదటి సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో హైదరాబాద్ వేదికగా సమావేశం నిర్వహించారు. క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ భేటీలో బోర్డు సభ్యులైన కపిల్ దేవ్ (Kapil Dev), పుల్లెల గోపీచంద్ (Pullela Gopichand), అభినవ్ బింద్రా, బైచుంగ్ భూటియా, సంజీవ్ గోయెంకా (Sanjeev Goenka), ఉపాసన కొణిదెల (Upasana Konidela) తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నూతన 'స్పోర్ట్స్ పాలసీ 2025', 2036 ఒలింపిక్స్ (Olympics-2036) లక్ష్యంగా ఈ సమీక్ష జరిగినట్లు సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ వేదికగా 2036 ఒలింపిక్స్ నిర్వహణకు బిడ్ వేసేందుకు గల అవకాశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాతే తెలంగాణలో క్రీడలు, లాంగ్ టర్మ్ అథ్లెటిక్ డెవెలప్‌మెంట్, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించినట్లు సమాచారం. స్టేడియాల ఆధునికీకరణ, 56 నియోజకవర్గాల్లో మినీ స్టేడియాల నిర్మాణంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.






