- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్.. ఇన్‌ఛార్జ్ మంత్రులకు కీలక సూచనలు
మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుండి సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఎం పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి అమెరికా నుండి సమీక్ష నిర్వహించారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జూమ్ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఎం పాల్గొన్నారు. ఈ జూమ్ మీటింగ్ లో జిల్లాల ఇన్ ఛార్జ్ మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మీనాక్షి చౌదరి పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల నివేదికను సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఎన్నికలపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 90శాతం స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని టార్గెట్ నిర్దేశించారు. రెబల్స్ బెడద లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఫిబ్రవరి 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28న నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వగా జనవరి 30న ముగిసింది. రాష్ట్రంలో మొత్తం 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. 2,996 వార్డులకు పోటీ జరగనుంది.






